Sundarakaanda 21th sarga
రాముడు మనమున మెదలగ ఏడ్చుచు
కన్నీటిని వణికెడి చేతితొ తుడుచుచు
రాక్షస గణముల మధ్యన ఒంటరై
శింశుప నీడన ఒదిగి కూర్చుని
రావణు మాటలు భయముతొ విన్నదై
ఒక గడ్డిపరకను తమ మధ్యన ఉంచి
గద్గద స్వరముతొ నిట్లు పలికెను
"నీ మనమున నన్నిక తుడువుము
నీ భార్యల కడకిక వెళ్ళుము
నీ ప్రార్ధన నేనిక వినను
జనకుని కులమున పుట్టిన దానను
దశరధ్‌కులమున మెట్టిన దానను
నీ తప్పుడు ప్రార్ధన్‌నే వినజాలను
రాముని పతిగా పొందిన దానను
నను నీ పత్నిగ ఏల చూసితివి
వేద పాఠములు చదివిన జ్ఞాతవు
నీ చరితను పతనము చేశి కొనకుము
నీ సతులను ఏ విధి చూసుకొందువో
రాముని మదిలో అదియె మెదులును
నాపై కోరిక మాని వెనుకకు తిరుగుము
పరుల పత్నిని కోరుట పాపము
నీ సతుల దృస్ఠిలో పతనము పొందకు
నీకిట ధర్మము శాస్ట్రము
బాగుగ చెప్పేడి వారే లేరా
పతనపుటంచున నిల్చిన నీకు
బుద్దులు నేర్పే వారే లేరా
పాడు కోర్కెలు నీలో రేపకు
రాక్షస వంశము పతనము పొందును
ధర్మము మరచిన రాజుని చూసి
దేశము బుగ్గిగ మారుట తధ్యము
వివిధ సంపదల నిండిన లంకను
నీ పాపపు బుద్ధుల మంటల కాల్చి
బూడిద బుగ్గిగ చేసి కొనకుము 12
దూరపు చూపులు లేకనె అశురులు
నాశము దిశగా పరుగిడు చుందురు
నీ బాధతొ రోదన చెందిన వారలు
కౄరుడు అశురుడు చచ్చెను చూడని
పండుగ దినములు జరుపు కుందురు
సూర్యుని నుండి కిరణము విడున?
నా భర్తకు దుర్రము నేనేవిధి అవను ?
రాముని కిచ్చిన నా ఈ చేతిని
వేరొక పురుషునికేల ఇవ్వగల ?
అగ్ని సాక్షి గా వివాహ మాడితి
వేద ప్రమాణముగ ప్రతిన బూనితిని
ఒక్క రామునికే సొంతము నేను
వాని కడకే నను కొని పొమ్ము
ఆయన తొటి స్నేహము నెరపుము
నీ ప్రాణము తెలివిగ నిలుపు కొనుము
రాముని త్వరగ శరణుజొచ్చుము
పాపము లన్నియు కడిగి కొనుము 20
రాముని కడకు నను పంపుము
నీ ప్రాణములైనా నిలుపు కొందుము
యముని పాశము, ఇంద్రుని వజ్రము
నీ ప్రాణము తీయను సంకోచించురేమో
రాముని బాణము అతి తీక్షణము
పిడుగుల శబ్దము మెరుపుల వేగము
వాడియగు ములుకులు వివిధ భంగులతొ
నీపాపపు జీవితము అంతము చేయును
గరుడుడు పాముల చీల్చిన విధముగ
రాముని అంబులు మీ గుండెలు చీల్చును
మీ రాక్షస మూకల భరతము పట్టి
రాముడు నన్ను కొని పోగలడు
రామ లక్ష్మణులు లేని సమయమున
వారి శౌర్యమునము ఎదురుగ నిలువక
కుక్కల నన్ను దొంగిలించితివి
వారితొ విరోధమును వెతికి తెచ్చితివి
కుబేర గిరులలొ, వరుణ రాజ్యములొ
ఎచట దాగినను నీ మరణము తధ్యము
అందుకే అసురుడ నా మాటవినుము
రాముని వెంటనే శరణు జొచ్చుము. 34
Tuesday, April 22, 2008
Subscribe to:
Posts (Atom)